Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsఅక్టోబ‌ర్ 3వ తేదీన 20 వ అల‌య్ బ‌లయ్

అక్టోబ‌ర్ 3వ తేదీన 20 వ అల‌య్ బ‌లయ్

📰 Generate e-Paper Clip

అక్టోబ‌ర్ 3వ తేదీన 20 వ అల‌య్ బ‌లయ్

తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 08, అద్దం న్యూస్ :     హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో అక్టోబ‌ర్ 3 వ తేదీన 20వ అల‌య్ బ‌ల‌య్ – 2025 వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, అల‌య్ బ‌లయ్ ఫౌండేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ లు తెలిపారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్‌లోని బండారు ద‌త్తాత్రేయ నివాసంలో సోమ‌వారం అలయ్ బలాయి – 2025 సన్నాహక సమావేశం జ‌రిగింది. అల‌య్ బ‌లయ్ ఫౌండేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, అల‌య్ బ‌లయ్ ఫౌండేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ బండారు విజ‌య‌ల‌క్ష్మీ లు మాట్లాడుతూ… 20వ అల‌య్ బ‌ల‌య్ – 2025 వేడుక‌ల‌కు ఐదు రాష్ట్రాల సీఎంల‌తో పాటు గ‌వ‌ర్న‌ర్లు, కేంద్ర మంత్రులు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. ఈ అల‌య్ బ‌ల‌య్ వేడుక‌ల్లో తెలంగాణ సంస్కృతిని, క‌ళల‌ను ప్ర‌ద‌ర్శన‌లు ఉంటాయ‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌సిద్ది చెందిన రుచిక‌ర‌మైన వంట‌లు ఉంటాయ‌న్నారు. ఈ స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ప్రేంసింగ్ రాథోడ్, బిజెపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఎన్.గౌతమ్ రావు, వేముల అశోక్, దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ ఛైర్మ‌న్ వేద కుమార్, ఓబిసి మోర్చ అధ్య‌క్షుడు జి.ఆనంద్ గౌడ్‌, నాయ‌కులు బి.శ్యాంసుందర్ గౌడ్, బాల్ద అశోక్. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పాశం యాద‌గిరి, కార్పొరేట‌ర్‌ కొంతం దీపిక, ప్ర‌సాద్, ఇ.అజయ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page