...

జలమండలిలో 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ

                          హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 02, అద్దం న్యూస్ :

లమండలి పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరిలో ఈ–ఎన్సీ అండ్‌ డైరెక్ట‌ర్ ఆపరేషన్స్–2 విఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్ట‌ర్ ఆపరేషన్స్–1 అమరేందర్ రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజ‌ర్ లు రాజేందర్, రామకృష్ణ, జిఎమ్ దామోదర్ రెడ్డి స‌హా ప‌లు స్థాయుల్లో ప‌నిచేసే ఉద్యోగులు ఉన్నారు. బోర్డులో వివిధ స్థాయుల్లో ప‌ని చేస్తూ రిటైర్ అయిన వీరిని ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఘ‌నంగా స‌త్క‌రించి వీడ్కోలు ప‌లికారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో నాణ్య‌మైన‌ సమయం గడపాలని, జీవితం సంతోషంగా ఉండాల‌ని వారు ఆకాక్షించారు. పదవీ విరమణ ద్వారా లభించే గ్రాట్యూటీ వంటి తదితర ప్రయోజనాల్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ డైరెక్ట‌ర్ మ‌హ్మ‌ద్ అబ్దుల్ ఖాద‌ర్, సీజీఎంలు, జిఎంలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.