హైదరాబాద్, అక్టోబర్ 27, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్ అన్నారు. ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మన ఆరె కటికల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు పాండురంగ చారి హాజరయ్యారు. ఆరె కటిక అభివృద్ధి సంఘం ఉపాధ్యక్షుడు నాగ శేషు, పాలెం రమేష్ ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్ మాట్లాడుతూ… రాష్ట్రంలో మన ఆరెకటికల జనాభా 10 లక్షలు ఉన్నట్టు మనకు అంచనా ఉందని.. మన మేకల మండిలపై, గోర్లు మేకల అంగళ్లపై, మన మటన్ వృత్తిపై ప్రభుత్వానికి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. మనల్ని ఇంకా ఈ ప్రభుత్వం గుర్తించడంలేదన్నారు. గత ప్రభుత్వంలో ఒక ఎకరం భూమి కోటి రూపాయలు నాటి ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణలో 2,620 వైన్స్‌లకు గాను, నూతనంగా వచ్చిన పాలసీలో 2021 సంవత్సరం వైన్స్ టెండర్లలో గత ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వలేదని శోచనీయమన్నారు. గౌడ్స్ కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టిలకు ఐదు శాతం గత మంత్రి కేటాయించారని, మాది సారావృత్తి మాకు ఎందుకు కేటాయించలేదు అని అడిగితే, ప్రశ్నిస్తే , ఇస్తామని చెప్పి గత ఎక్సైజ్ శాఖ మంత్రి మోసం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అధిక జనాభా ఉన్న కులాలను మాత్రమే గత ప్రభుత్వం గుర్తించిందని.. ఈ ప్రభుత్వం సైతం అదే పని చేస్తుందన్నారు.
2025 సంవత్సరంలో రవీంద్రభారతిలో భారీ సభ జరిపితే కాంగ్రెస్ మంత్రులు, మాజీ ఎంపీలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వచ్చి అన్ని రకాల అండగా ఉంటామని చెప్పింది ఉత్తదే అయిందని ధ్వజమెత్తారు. ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది మా మారెకటిక జనాభా ప్రభుత్వం నూతనంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మేము పూర్తి అర్హులమన్నారు. ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఇవ్వాలి జీవో తేవాలని, వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ తేవాలన్నారు. బీసీ డి నుండి బిసిఏ హోదా కల్పిస్తూ జీవో తేవాలని, మా మటన్ షాపులలో కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మేకల మండిలను ఆధునికరించి మా ఆరె కటికలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరె కటికలకు ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో పూర్తి హక్కు కల్పించాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు ప్రభుత్వం కల్పిస్తూ జీవో తేవాలన్నారు. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం నూతనంగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా కేడి దినేష్ ను, గౌరవాధ్యక్షుడిగా కె.నందీశ్వర్ ను, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కామలేకర్ వనజాబాయిని, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా మోతికర్ శోభాయని, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎస్.సరస్వతి బాయ్ ని ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ జె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కెఎన్.శ్రీనివాస్, కె.వెంకటేష్, డి.ధర్మేందర్, నరేష్, జి.రాజేష్, కె.జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.






