Saturday, September 19, 2026
No menu items!
HomeEducationత్వరలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ

త్వరలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ

📰 Generate e-Paper Clip

త్వరలో భారీగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: త్వరలో మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీరంతా వచ్చే జనవరిలో డ్యూటీలో చేరుతారు. వీరితో పాటు 1260 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కూడా వచ్చే నెలలో డ్యూటీలో చేరనున్నారు. ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ర్యాంకుల జాబితా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయనుంది. పారదర్శకత కోసం ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు సహా అన్ని రకాల వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది బోర్డు. ఇప్పటికే బోర్డు రెండు సార్లు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది.

ర్యాంకుల జాబితా విడుదల తర్వాత మరోసారి అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తర్వాత 1 : 1.5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల ను ఎంపిక చేయనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సెలక్షన్ జాబితా విడుదల చేస్తారు. ప్రభుత్వం గతేడాది 7 వేలకు పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసింది. దీంతో మొత్తంగా రెండేండ్లలో ఆరోగ్య శాఖలో 11 వేలకుపైగా పోస్టుల భర్తీ కానున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page