Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADజాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ...

జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

జాతీయ ప‌తాక రూప‌క‌ర్త
పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో
80 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   జాతీయ ప‌తాక రూప‌క‌ర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్‌లోని ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీదేవి హాజ‌రై జెండా వందనం చేశారు. స్మారక సంస్థ చైర్ పర్సన్ శ్యామల్ రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బంగారు ప్రశాంత్, ట్రస్ట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆత్మీయ అతిథులుగా మేడి సత్యనారాయణ, పానుగంటి లక్ష్మణ్, మాన్యం శ్రీకాంత్ ఫణి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ఎస్ఈఎస్ స్కూల్ విద్యార్థులు హాజ‌రై జెండా వందనం, దేశ భక్తి గీతాల ఆల‌ప‌న‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ‌హించారు. అనంతరం వారికి మిఠాయిలను నిర్వాహ‌కులు అంద‌చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page