హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ చేపట్టిన పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 2, అద్దం న్యూస్ :   నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల పై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రావ‌డంతో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బుధ‌వారం అశోక్‌న‌గ‌ర్ సిటి సెంట్రల్ లైబ్రెరీ లేన్,అశోక్‌న‌గ‌ర్ స్ట్రీట్ నెంబర్ 1, 2 లలో పర్యటించారు. కార్పొరేటర్ పావ‌ని సూచనల మేరకు అశోక్‌న‌గ‌ర్‌లో వరదనీటిని తొలగించేందుకు హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ చేపట్టిన పనులను అధికారులు, బీజేపీ నాయకులతో కలసి ఆమె పర్యవేక్షించారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా వుండాలని, డివిజన్ లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ సిబ్బందికి కార్పొరేట‌ర్ పావ‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మహేష్,హైడ్రా ఎమర్జెన్సీ టీమ్ సిబ్బంది, బిజెపి నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, ఆకుల సురేందర్, సురేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page