Friday, September 18, 2026
HomeHyderabadయనమల రాజుకు అరుదైన గౌర‌వం.. బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డ్‌తో సత్కారం

యనమల రాజుకు అరుదైన గౌర‌వం.. బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డ్‌తో సత్కారం

యనమల రాజుకు అరుదైన గౌర‌వం..

బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డ్‌తో సత్కారం


బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డును అందుకుంటున్న య‌న‌మల రాజు


హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ :   నగరానికి చెందిన య‌న‌మ‌ల‌ రాజుకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఎలాంటి విద్యార్హ‌త‌, కుల‌, మ‌త‌, ప్రాంత‌, లింగ బేధం లేకుండా వంద‌లాది మంది నిరుద్యోగులు, గృహిణులు, చిరు ఉద్యోగులు, వ్యాపారంలో న‌ష్ట‌పోయిన వారికి అండ‌గా నిలవడంతో పాటు, తీవ్ర‌మైన అప్పుల బాధ‌లో ఉండి చావే శ‌రణ్య‌మ‌నుకున్న‌ ఐదొంద‌ల మంది నిరాశ్ర‌యుల్ని ల‌క్షాధికారుల్ని చేసినందుకు గానూ ఆయ‌న్ను బెస్ట్ రీ సేల్ రియల్టీ అవార్డు వ‌రించింది. హైద‌రాబాద్‌ అమీర్‌పేట్‌లోని ఆదిత్య క‌న్వేష‌న్ సెంట‌ర్‌లో బిజ్ నెట్ వర్క్, రియల్టీ సిండికేట్ వారు నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో య‌న‌మ‌ల రాజుకు ఈ అవార్డును బిజ్ నెట్ వర్క్ సిఈఓ నారాయణ స్వామి, రియల్ ఎస్టేట్ సిండికేట్ ప్రతినిధులు తమ్మిశెట్టి సుధాకర్ తదితరులు అందజేశారు. యనమల డెవలపర్స్ కంపెనీ ద్వారా భూముల రేట్లు పెరగడం, ప్రమోషన్, మార్కెటింగ్, కంపెనీ లాభలు తదితర వాటి వల్ల కొత్త ప్లాట్ల రేట్లు కస్టమర్ల కు భారంగా మారిన నేపథ్యంలో పాత ప్లాట్లనే రీ సేల్ చేస్తున్నారు. దీని వల్ల షాద్‌న‌గ‌ర్ లాంటి చోట 6 లక్ష్యాలకే ఆడబిడ్డ కు ప్లాట్ ఇస్తూ, కొనిపించడమే కాదు…అవసరమైతే అమ్మించడం కూడా మా బాధ్యత అంటూ మార్కెట్ రేట్ కంటే 30 శాతం తక్కువ‌కు ఇస్తూ ఏడాది వ్యవధిలోనే 500 పైగా రీ సేల్ ప్లాట్లు విక్రయించారు. ఈ నేప‌థ్యంలోనే ఓ వైపు ఉద్యోగం లేక ఇబ్బంది ప‌డుతున్న నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి మార్గం చూపిస్తున్నారు. ఆయ‌న స్థిరాస్తి రంగంలో పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ ప్రాపర్టీ, మార్కెటింగ్, సేల్స్ మెలుకువ‌లు, పెట్టుబ‌డియేత‌ర‌ బిజినెస్ త‌దిత‌ర అంశాల‌పై ఆర్టిక‌ల్స్ రాస్తూ, ఆయా ఛానెల్స్‌లో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎంద‌రినో చైత‌న్య ప‌ర్చారు. రియ‌ల్ ఏస్టేట్ ఫ్రీలాంచ్, స్కీమ్ మోసాలు, లాభాలు, డాక్యుమేంటేష‌న్‌ త‌దిత‌ర.. ఏ రంగం, ఏ ప్రాంతం, ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఇన్వెస్ట‌ర్ల‌కు అవ‌గాహన క‌ల్పిస్తున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page