భార్య, భార్య తరపు బంధువుల వేధింపులు, అవమానాలు, బెదిరింపులు భరించలేక హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య

న‌వ వ‌రుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం 

భార్య, భార్య తరపు బంధువుల వేధింపులు, అవమానాలు, బెదిరింపులు భరించలేక
హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి నవ వరుడు ఆత్మహత్య

అడిక్‌మెట్ బ‌హ‌దూర్‌న‌గ‌ర్‌లో విషాదఛాయలు

సంతోష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్లెక్సీలు ఏర్పాటు చేసిన బంధువులు

హైదరాబాద్, జులై 7, అద్దం న్యూస్ :  ఈ మ‌ధ్య‌న క‌ట్టుకున్న భార్య‌లే భ‌ర్త‌ల పాలిట‌ య‌మ‌పాశాలుగా మారుతున్నారు. కడదాకా తోడుండి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే.. కనికరం లేకుండా కడతేర్చుతున్నారు. ఇటీవల జరిగిన షిల్లాంగ్, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటనలు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రియుడి కోసం.. కట్టుకున్న భర్తలను అతి కిరాతకంగా చంపించారు. భార్యలు.. దీనికోసం పెద్ద స్కెచ్చులే వేశారు.. అయితే.. ఈ కేసులో భార్యకు ఉన్న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దాచిపెట్టి క‌ట్టుకున్న భ‌ర్త‌ను ర‌క‌ర‌కాలుగా వేధించి, బెదిరించి అత‌ని ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైంది భార్య‌, ఆమె త‌ర‌పున బంధువులు. హైదరాబాద్‌ నగరం అడిక్‌మెట్‌కు చెందిన భ‌ర్త హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి ఆత్మ‌హత్య చేసుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. తాళి కట్టుకున్న‌ భార్య, ఆమె తరపు బంధువులు చేసిన వేధింపులు, అవమానాలు, బెదిరింపులు భరించలేక ఓ నవ వరుడు హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ బ‌హ‌దూర్‌న‌గ‌ర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించి మృతుడి తల్లి మంగమ్మ, సోదరి భారతి, బావ రూపేష్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడిక్‌మెట్ బహదూర్‌న‌గ‌ర్‌లోని క‌ళా రెసిడెన్సిలో అద్దెకు నివాసం ఉంటున్న మంగమ్మ, బాబురావుల కుమారుడు జె.సంతోష్ (36)కు రామంతాపూర్‌కు చెందిన శారదతో గడచిన మే 9వ తేదీన వివాహం జరిగింది. సంతోష్‌ హబ్సీగూడలోని ఐఐసిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రాత్రి వేళలో బౌన్సర్గా కూడి పనిచేస్తాడు. పెళ్లైన తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల శారద సంతోష్ తో సంసార జీవితం గడపడానికి సహకరించడం లేదు. దీంతో సంతోష్ ఆమెను ప్రశ్నించగా తనకు గైనిక్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేది. దీంతో తనకు పెళ్లికి ముందు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేశారని భావించిన సంతోష్ ఆమెకు పెళ్లి రద్దు కోసం లీగల్ నోటీసులు పంపించారు. దీంతో భార్య శారద తరపు బంధువులు పెళ్లి జరిగింది కాబట్టి శారద ఆరోగ్య సమస్యలతో పాటు బాగోగులు నువ్వే చూడాలని సంతోష్ పై వత్తిడి పెంచారు. దీంతో అందుకు ఆయన నిరాకరించడంతో భార్య శారద సంతోష్‌ను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసింది. భార్య ఆరోగ్య స‌మ‌స్య గురించి తెలుసుకున్న సంతోష్ కుటుంబ స‌భ్యులు ప‌లు ఆసుప‌త్రుల్లో ప‌రీక్ష‌లు చేయించ‌గా ఆమె గ‌త మూడేళ్ల నుంచి గైనిక్ స‌మ‌స్య ఉంద‌ని, ఆమె మందుల‌ను వాడుతుంద‌ని వైద్యులు తెలిపారని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 4వ తేదీన సంతోష్ ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో అత‌ని భార్య శార‌ద ఒక్క‌తే ఇంటికి వ‌చ్చింది. నీ ఆరోగ్య స‌మ‌స్య‌ను దాచిపెట్టి పెళ్లి చేశారు.. ఏమైనా ఉంటే పెద్ద మ‌నుషుల‌తో మాట్లాడు అని సంతోష్ చెప్పాడు. దీంతో శార‌ద అదే రోజు ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మ‌హ‌త్యయ‌త్నానికి పాల్ప‌డింది. దీంతో శార‌ద, ఆమె బంధువులు ఉప్ప‌ల్ ఉమెన్స్ పిఎస్‌లో సంతోష్ పై ఫిర్యాదు చేశారు. శార‌ద ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారింది. శార‌ద త‌ర‌పు బంధువులు సంతోష్‌కు ఫోన్లు చేసి ర‌క‌ర‌కాలుగా వేధించారు. నువ్వు మొగొడివి కాదు.. నీకు మ‌గ‌త‌నం లేదు అని రాంన‌గ‌ర్‌లో పోస్ట‌ర్లు పెడుతామ‌ని, శార‌ద‌ను కాపురానికి తీసుకెళ్ల‌క‌పోతే నీ అక్క‌, బావ‌ను, తల్లిదండ్రుల‌ను జైలుకు పంపుతామ‌ని శార‌ద మేన‌మామ‌లు, అత్త‌లు కె.ర‌మేష్‌, అత‌ని భార్య సునిత‌, కె.సాయినాథ్‌, యాద‌గిరి, అత‌ని భార్య బేబ‌క్క‌, వెంక‌టేష్‌, మ‌హేశ్వ‌రి, వ‌ర‌ల‌క్ష్మీలు బెదిరించారు. అదే స‌మ‌యంలో సంతోష్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావ‌డంతో నాచారం పిఎస్‌లో మిస్సింగ్ కేసును నమోదు చేశామ‌ని తెలిపారు. తీరా లేక్ పోలీసుల నుంచి ఫోన్ రావ‌డంతో వెళ్లి చూడ‌గా సంతోష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని తెలిసింది. అందరినీ జైలుకు పంపిస్తామని సంతోష్‌ను బెదిరించడంతో సంతోష్ తన వల్ల కుటుంబ సభ్యులు జైలుకు పోయే ప్రమాదం ఉందని మానసిక వేదనకు గురై శ‌నివారం హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతని మృతికి భార్య శారదతో పాటు అత్తమామ, మేనమామలు కె.ర‌మేష్‌, అత‌ని భార్య సునిత‌, కె.సాయినాథ్‌, యాద‌గిరి, అత‌ని భార్య బేబ‌క్క‌, వెంక‌టేష్‌, మ‌హేశ్వ‌రి, వ‌ర‌ల‌క్ష్మీలే కారణం అని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని నాచారం పిఎస్‌లో ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు.

సంతోష్‌కు కన్నీటి వీడ్కోలు :

ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన జె.సంతోష్ కు సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. సంతోష్ మృతదేహం బహదూర్‌న‌గ‌ర్‌లోని ఇంటి నుంచి ఊరేగింపుగా రాంనగర్ గుండూ మీదుగా అంబర్‌న‌గ‌ర్ ల‌లితాన‌గ‌ర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దారిపొడ‌వున సంతోష్ చిత్ర ప‌టానికి పాల‌తో అభిషేకం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page