ఎస్ఆర్‌టి స్థానికుల సమస్యలను పరిష్కరిస్తాం
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, జులై 8, అద్దం న్యూస్ : ఎస్ఆర్‌టి స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్‌టి కాలనీలో కార్పొరేటర్ పావని పర్యటించారు. మంచినీటి లోప్రెషర్ మరియు కలుషిత మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ పావనికి స్థానికులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ పావని వెంటనే వాటర్ వర్క్స్ డిజిఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్ వారి సిబ్బందిని ఎస్ఆర్‌టి కాలనీకి రప్పించి, స్థానికులతో కలిసి వారి సమస్యను వివరించారు. తీవ్రమైన మంచి నీటి లో ప్రేషర్ సమస్యతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారని, వెంటనే లో ప్రెషర్ సమస్యకు గల కారణాలను కనుగొని, ఏరియాకు కేటాయించిన సమయానుసారం మంచినీటి సరఫరా జరిగేలా వెంటనే చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ పావని అధికారులకు సూచించారు. డివిజన్ వ్యాప్తంగా మంచినీటి లోప్రెషర్, కలుషిత మంచినీటి సమస్య పై తమకు వస్తున్న అనేక ఫిర్యాదులపై జలమండలి ఎండితో పలుమార్లు సమీక్షించామని, అధికారులు ప్రత్యేక దృష్టి వహించి సమస్యను పరిష్కరించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని కార్పొరేటర్ పావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, శ్రీనివాస్ యాదవ్, బి.భరత్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, ఎస్ఆర్‌టి నాయకులు డేవిడ్, ప్రశాంత్, నర్సింగ్ రావు, యాదయ్య, శివ, శ్రీధర్, సంజీవ్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply