హైదరాబాద్, అద్దం న్యూస్ : నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ భరణి ఆయిల్ డిపో వీధిలో రూ.14 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు, ముషీరాబాద్ డివిజన్ ఫకీర్వాడా బస్తీలో రూ. 8 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు, ఎంసిహెచ్ కాలనీలో రూ.12 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమో ఆయా ప్రాంతాల్లో సిసి రోడ్లను వేయిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు వేయకముందు ఆయా ప్రాంతాల్లో మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్లను వేయిస్తున్నామన్నారు. ప్రతి చిన్న వీధిలో సైతం సిసి రోడ్లను వేయించి అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మరిన్ని నిధులను మంజూరు చేయిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారి, జిహెచ్ఎంసి డిఈ గీత, ఏఈలు వినోద్, మురళీ, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్, ఎంఎ.జావెద్ ఖాన్, పులిగిల్ల శ్రీధర్‌చారి, ముదిగొండ మురళీ, ఎయిర్టెల్ రాజు, భాస్కర్ నేత, సత్యనారాయణ బాబు, దీన్‌దయాల్‌రెడ్డి, చింటు, శ్రీకాంత్, బల్వంత్, ముషీరాబాద్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు కంచికుమార్ ముదిరాజ్, బిజెపి నాయకులు గడ్డం నవీన్, బద్రి నారాయణ, ఆర్.జనార్థన్, లక్ష్మణ్, అజయ్ గుప్త, అనిల్, జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్లు శివ, దాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.












Leave a Reply