తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైద‌రాబాద్‌, జూన్ 11, ( అద్దం న్యూస్ ) :   హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలబ్‌గూర్–పటాన్‌చెరు పంపింగ్ మెయిన్‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్‌లైన్‌లో రుద్రారం గ్రామం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ కార‌ణంగా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. ప‌నులు పూర్తి కాగానే య‌ధావిధిగా నీటి స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ జ‌రుగుతుంది.

జలమండలి ఎండి అశోక్‌రెడ్డి మరమ్మతుల పనులపై తాజా పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్స్‌ అండ్ మెయింటెనెన్స్‌, ట్రాన్స్‌మిషన్‌ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా పనులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు.

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు :

1. ఓ అండ్ ఎం డివిజ‌న్ 17: ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.
2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22: బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.
3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు.
4. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్.
5. ఓ అండ్ ఎం డివిజ‌న్ 9: కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్

పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని అధికారులు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page