Friday, September 18, 2026
HomeHyderabadజలమండలిపై పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సమీక్ష‌

జలమండలిపై పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సమీక్ష‌

 

జలమండలిపై పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సమీక్ష‌

జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలోస స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్న పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబ‌ర్తి, ఎండి అశోక్‌రెడ్డి
జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలోస స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్న పుర‌పాల‌క శాఖ సెక్ర‌ట‌రీ ఇలంబ‌ర్తి, ఎండి అశోక్‌రెడ్డి

హైద‌రాబాద్‌, మే 3, అద్దం న్యూస్ :    జ‌ల‌మండ‌లిలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు, మంచినీటి స‌ర‌ఫ‌రా మురుగునీటి వ్య‌వ‌స్థ నిర్వహణపై రానున్న మూడు సంవ‌త్స‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేపట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ కార్య‌ద‌ర్శి ఇలంబర్తి స‌మీక్ష నిర్వ‌హించారు. ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో శనివారం జరిగిన ఈ సమీక్షా స‌మావేశానికి ఎండీ అశోక్‌రెడ్డితో పాటు, ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్ట‌ర్లు, ఇత‌ర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సందర్బంగా ఎండీ అశోక్‌రెడ్డి జ‌ల‌మండ‌లిలో పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు, బోర్డులోని వివిధ విభాగాలు వాటి పనితీరు, నగరానికి నీటి సరఫరా, ఎస్టీపీలు, మురుగు శుద్ధి నిర్వహణతో పాటు.. భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్టుల గురించి వారికి వివరించారు. అలాగే జలమండలిలో చేపట్టిన వివిధ సంస్కరణలు, రెవెన్యూ, ఐటీ, ట్యాంకర్ బుకింగ్- డెలివరీ, మెట్రో కస్టమర్ కేర్, స్కాడా సిస్టం, పని చేసే ప్రాంతాల్లో కార్మికుల కోసం జలమండలి చేపట్టే రక్షణ చర్యలతో పాటు.. ఇప్పటి దాకా చేపట్టిన ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి, హడ్కో రిజర్వాయర్లు, ఓఆర్ఆర్ ఫేజ్- 1, 2 ప్రాజెక్టులు, ముగురు శుద్ధి కోసం చేసే ఎస్టీపీల ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రానున్న మూడు నెలలు.. సంవత్సరంలో జలమండలి చేపట్టే వివిధ ప్రాజెక్టులు, తాగునీరు, సీవరేజ్ నిర్వహణపై కార్యాచరణ రూపొందించాలని సెక్ర‌ట‌రీ ఇలంబర్తి సూచించారు. అలాగే జ‌ల‌మండ‌లి వేస‌వి కార్యాచ‌ర‌ణ‌పై చర్చించిన సెక్రటరీ నగరంలో టాంకర్ బుకింగ్, డెలివరీల సరళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page