టిడిపికి ఉన్న బ‌లం, ఆద‌ర‌ణ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల‌కు లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

టిడిపికి ఉన్న బ‌లం, ఆద‌ర‌ణ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల‌కు లేదు 

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైద‌రాబాద్‌, మే 3, అద్దం న్యూస్ :   టిడిపికి ఉన్న బ‌లం, ఆద‌ర‌ణ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల‌కు లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్ట పరచడంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని డివిజన్ కమిటీల ఏర్పాటుకు కొరకు రాష్ట్ర పార్టీ నియమించిన నియోజకవర్గ పరిశీలకులతో పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబాతో శ‌నివారం న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో సమావేశం జరిగింది ఈ సన్నాహక సమావేశంలో నియోజకవర్గాలకు పరిశీలకులుగా వెళ్తున్న వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు అధ్యక్షులు సాయిబాబా పరిశీలకులతో డివిజన్ కమిటీ ఎన్నికలలో పాటించాల్సిన విధి – విధానాలను, తగిన సూచనలను తెలియజేసారు. గడువులోపు డివిజన్ కమిటీలను పూర్తి చేసి పూర్తయిన ఆయా కమిటీలను జిల్లా కార్యాలయానికి నివేదిక రూపంలో ఇవ్వాలని పరిశీలకులకు సాయిబాబా సూచించారు. ఈ సందర్బంగా సాయిబాబా మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల బలం ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీకి గాని ప్రతిపక్ష పార్టీకి గానీలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిఉందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. డివిజన్ కమిటీలను పూర్తి ప్రజాస్వామ్యంగా ఎన్నుకోవడం, కార్యకర్తల మనోభావాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉందని అన్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎంకె.బోసు, రాజేంద్ర ప్రసాద్, ఎబిఆర్ మోహన్, పరశురాం, ఎం.రాజు, శ్యాంసుందర్, సి.విఠ్టల్, లయీఖ్, వీరబాబు, జాకోబ్ బాల నరసింహులు, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page