వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు
హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు సంబంధించిన హుండీని లెక్కించారు. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ ల పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు, భక్తులు హాజరై హుండీని లెక్కించారు. 2 లక్షల 19 వేల 540 వందల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని ఈవో దేవనాధం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెనోవేషన్ కమిటీ సభ్యులు శ్యామ్ కుమార్, ఆలయ అర్చకులు వెంకటాద్రి, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png