ఘనంగా రేడియంట్ హై స్కూల్ 61 వ టాపర్స్ డే వేడుకలు
హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్‌లో ఉండే రేడియంట్ హై స్కూల్ 61వ టాపర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ రాజాడీలక్స్ థీయేటర్ ఎదురుగా గల ఓ ఫంక్షన్‌హాల్‌లో టాపర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. రేడియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సరి నుంచి 10వ తరగతి ఫస్ట్ ర్యాంకులను సాధించిన 44 మంది విద్యార్థనీ, విద్యార్థులకు ఒక్కొక్కరికి తులం వెండితో కూడిన పతకాలను అందచేశారు. అలాగే వారికి సర్టిఫికెట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. రేడియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అహ్మదుల్లా భక్తియారి మాట్లాడుతూ… రేడియంట్ హై స్కూల్ ప్రారంభం నాటి నుండి నేటి వరకు టాపర్స్ డే వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ టాపర్స్ డే కార్యక్రమం విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఎ.జావీద్ ఖాన్, మహ్మద్ అలీ, ఖదీర్, మెయిన్, జునేద్, రేడియంట్ హై స్కూల్ టీచర్లు ఇర్ఫానా అంతుల్ ముబీన్, షీలారాజ్, ఆశ్రు, మంజూశ్రీ, అనీఫా ఖలీల్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply