పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేయాలి
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుంది
సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
– ఆదం సంతోష్ కుమార్

సభలో మాట్లాడుతున్న ఆదం సంతోష్
సికింద్రాబాద్, మే 5, అద్దం న్యూస్ : రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ నియోజకవర్గం కంటేస్టేడ్ ఎమ్మెల్యే, ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు విస్తృతస్థాయి సమావేశం ఆయన పాల్గొని ప్రసంగించారు. సీతాఫల్ మండి డివిజన్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పార్టీ అసెంబ్లీ పర్యవేక్షుడు మాజీ ఎమ్మెల్యే లక్షమారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ సిద్ధేశ్వర్ అతిథులుగా హాజరై పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కష్టించి పనిచేసే వారికి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రచార కార్యదర్శి దాడిగ సందీప్ రాజ్, వాహిద్, షకీల్ ఖాన్, అనిల్, అభిషేక్, సత్యనారాయణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply