సహభావనలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభిస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త
బండ్లగూడ, మే 16, అద్దం న్యూస్ : బండ్లగూడలోని సహభావన టౌన్షిప్లో బ్యాడ్మింటన్ కోర్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఫణికుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, ప్రగతి, చైతన్య, శరత్, నాగరాజ్, విష్ణు, ప్రకాశ్, అభి, రాజేందర్ రెడ్డి, ఢిల్లీ నరేష్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply