Friday, September 18, 2026
HomeHyderabadతెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి

తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి

తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలి

హైద‌రాబాద్‌, మే 20, అద్దం న్యూస్ :    తెలంగాణలో లింగ మార్పిడి ఆసుపత్రిని నెలకొల్పాలని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన నల్సా తీర్పును గౌరవిస్తూ లింగ మార్పిడి ఆపరేషన్ల కు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పించాలని ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త రచన ముద్రబోయిన డిమాండ్ చేశారు. తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రం టిపిఎస్‌కెలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త రచన ముద్రబోయిన మాట్లాడుతూ… హిజ్రా, ట్రాన్స్ జెండర్, లెస్బియన్ బైసెక్సువల్, ఇంటర్ సెక్స్, ఇంటర్ జెండర్ వీళ్ళందరికీ సమాజంలో వివక్ష చూపకుండా తోటి మనుషుల్లా గౌరవించాలని సాధారణ ప్రజలకు ఉన్న హక్కులను తమకు కల్పించాలని డిమాండ్ చేశారు. లింగ గుర్తింపు అనేది ప్రతి వ్యక్తి హక్కు అది పుట్టుకతో ఉండవచ్చు… ఉండకపోవచ్చు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ‌ ఉండాలని కోరారు. భారత రాజ్యాంగం లింగ వివక్ష వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నారు. ట్రాన్స్ జెండర్లు బతుకుదెరువు కోసం భిక్షాటన సెక్స్ వర్కర్ గాను యాచకులుగాను తప్ప జీవించలేని స్థితి ఎందుకు వస్తుందన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా యాచించడానికి వీల్లేదని పోలీసుల వత్తిడి చేయడం కరెక్ట్ కాదన్నారు. త‌మిళ‌నాడులో ఉన్న మాదిరిగా ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కొరకు తెలంగాణలో హిజ్రా ట్రాన్స్ జెండర్ సంక్షేమ మండలిని ఏర్పాటు చేయాల‌న్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కొరకు సామూహిక గృహ పథకాలు స్మశానవాటికలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సదుపాయాలు కల్పించాలని, ఉచిత లింగ మార్పిడి చేసి ఉచిత చికిత్సలు చేయించాలన్నారు. విద్యా సంస్థల్లో వీళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని, వివక్షపూరితమైన చట్టాలు తొలగించాలని, ట్రాన్స్ జెండర్ కు పింఛన్లు ఇవ్వాలని అన్నారు. తక్షణమే వీళ్లకు తెలంగాణలో ట్రాన్స్ జెండర్ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల‌ను పరిష్కరించాలని జూన్ రెండవ వారంలో పెద్ద ఎత్తున “స్వాభిమాన యాత్ర” ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్య, స్వేచ్ఛ, అహ్మద్ మాంగల్య తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page