...

మల్లన్న గంగ తెప్ప‌ ఊరేగింపున‌కు ఘన స్వాగతం

మల్లన్న గంగ తెప్ప‌ ఊరేగింపున‌కు ఘన స్వాగతం

 హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ బాకారంలోని శ్రీ శ్రీ శ్రీ భ్ర‌మ‌రాంబ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యం ( మ‌ల్ల‌న్న ) జాత‌రలో భాగంగా ఒగ్గు పూజారులు, ఆలయ సమిటి సభ్యులు, ఆనవాయితీగా నిర్వహించే మల్లన్న స్వామి వారి పల్లకితో ” గంగ తెప్ప ” ఊరేగింపున‌కు గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మల్లన్న ఆలయ మేనేజింగ్ ట్ర‌స్టీ నల్లవెల్లి అంజి రెడ్డి, ఒగ్గు పూజరులతో పాటు ముఖ్య అతిథులను సన్మానించి, స్వామి వారి పల్లకికి పూజలు చేసి, సాకలు పెట్టి, గంగ తెప్ప ఊరేగింపున‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, పాల శ్రీనివాస్, మదన్మోహన్, జ్ఞానేశ్వర్, సాయి కుమార్, జ్ఞానేష్‌, సంపత్ యాదవ్, బస్తీ అధ్యక్షుడు ఏళ్లమ్, నరేష్, పి.రాజు, వీరేష్, రాజశేఖర్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.