Saturday, September 19, 2026
No menu items!
Homeక్రైమ్వ్యక్తిని హత్య చేసి.. ఆ త‌ర్వాత‌ నీటి సంపులో పడేసి...

వ్యక్తిని హత్య చేసి.. ఆ త‌ర్వాత‌ నీటి సంపులో పడేసి…

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్ క్రైమ్‌, అద్దం న్యూస్   ఓ వ్యక్తిని హత్య చేసి నీటి సంపులో పడేసిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. ముషీరాబాద్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… అల్వాల్‌కు చెందిన సత్నం సింగ్ (58) ఈనెల 4వ‌ తేదీన ఉదయం ముషీరాబాద్ దేవి చౌక్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్లిన అతను రాత్రి వరకు రాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్‌లో మిస్సింగ్ కావడంతో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తును కొనసాగించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతను గాంధీనగర్ పోలీస్‌స్టేష‌న్ పరిధిలోని బోయిగూడకు చెందిన నయన్ చంద్ర నాయక్ ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇంట్లో నుండి ఒక వ్యక్తి మాత్రం బయటికి వచ్చినట్లు గమనించిన పోలీసులు తాళం పగలగొట్టి ఇంట్లో పరిశీలించడంతో పాటు ఇంటి ముందున్న సంపుని మూత తీసి చూడడంతో సత్నం సింగ్ మృతి చెంది కనిపించాడు. తలపై కొట్టి హత్య చేసి నీటి సంపులో వేసి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతో నిందితుడు హత్య చేసి ఉంటాడని పోలీసులు బాలవిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page