Sunday, September 20, 2026
No menu items!
Homecinemaఅదిరిపోయే ట్రీట్..

అదిరిపోయే ట్రీట్..

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బాలీవుడా బాబా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కాజోల్ (Kajol) జంటగా నటించిన ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'(టీడీఎల్) (Dilwale Dulhania Le Jayenge) భారతీయ సినిమా చరిత్రలో గొప్ప ప్రేమకథల్లో ఒకటిగా హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఈ జంట కెమిస్ట్రీ మూవీలోని మరపురాని సంభాషణలు.. అద్భుత సంగీతం డీడీఎల్సీ ని కేవలం సినిమాగా కాకుండా ఒక గొప్ప అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో అక్టోబర్ 20, 1995లో విడుదలైన ఈమూవీ ఇప్పటికీ.. మహారాష్ట్రలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఆడుతూనే ఉంది. కాగా ఈ చిత్రం విడుదలై ఇటీవలే 30 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలైన రాజ్ (షారుఖ్ ఖాన్), సిమ్రాన్ (కాజోల్)ల కాంస్య విగ్రహాన్ని లండన్లోని ప్రఖ్యాత లీసెస్టర్ స్క్వేర్ లో ఏర్పాటుచేశారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన షారుఖ్ ఖాన్, కాజోల్ తమ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా తమ ఐకానిక్ పోజులతో వైరల్ గా నిలిచారు. అనంతరం షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘పెద్ద పెద్ద దేశాల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. సెనోరిటా? అంటూ ఈ సినిమాలోని తన ఫేమస్ డైలాగ్తో అదరగొట్టాడు. మరోవైపు లండన్లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’ ట్రైల్లో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా డీడీఎల్ నిలిచింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page