Saturday, September 19, 2026
No menu items!
HomecinemaMehreen: అసలేం జరుగుతోంది..?

Mehreen: అసలేం జరుగుతోంది..?

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్నీని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ మెహ్రీన్ (Mehreen) పిర్జాదా.. ఈ చిత్రంలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2. ఎఫ్3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులుగా సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్న ఈభామ.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను పలకరిస్తుంది.

అయితే తాజాగా ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై మెహ్రీన్ ఫైర్ అయ్యింది. ఇది ఏమాత్రం అంగీకారం కాదు. ప్యాసింజర్లు రోజుల తరబడి ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుంటున్నరు. ఇదేదో చిన్నది కాదు.. నిర్లక్ష్యం. కొత్త డీజీసీఏ నిబంధనలు వచ్చినప్పుడే మీ షెడ్యూల్స్ సరి చేసుకోవాల్సింది. కస్టమర్లను తప్పుదోవ పట్టించడం కాదు.. మీరు సృష్టించిన గందరగోళం దారుణమైనది. అసలేం జరుగుతోంది? బహిరంగంగా చెప్పండి.. మీ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి పరిహారం చెల్లించండి’ అంటూ డిమాండ్ చేసింది. కాగా.. 550 విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page