అంబర్పేట్, అద్దం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచే విధంగా కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య, లేబర్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply