ట్యాంక్‌బండ్ పై స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, జూన్ 5, అద్దం న్యూస్ :   బ‌హుజ‌న నాయ‌కుడు స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ గౌడ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోలుపు నూరి రమేష్ గౌడ్ కోరారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను మసాబ్‌ట్యాంక్ బీసీ కార్పొరేషన్ కార్యాల‌యంలో గురువారం మర్యాదపూర్వకంగా ర‌మేష్ గౌడ్ కలిశారు. ఈ సంద‌ర్భంగా స‌ర్ధార్ స‌ర్వాయి పాపన్న గౌడ్ విగ్ర‌హాన్ని ట్యాంక్‌బండ్ పై ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల‌ని నూతి శ్రీకాంత్‌గౌడ్‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌడ సంఘం నాయ‌కుడు యెల్లవర్తి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page