Friday, September 18, 2026
HomeTelanganaప్రజాగొంతుకలైన‌ ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు అరెస్టులకు లొంగరు

ప్రజాగొంతుకలైన‌ ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు అరెస్టులకు లొంగరు

Whatsapp image 2025 03 13 at 20.30.25

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల మనోబలాన్ని దెబ్బ తీయడానికి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు వారితో కుమ్మక్కు అయి తప్పుడు కేసులు బానాయించి ప్రజా గొంతుక అయిన నహీం పాషా, రాజేందర్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర‌ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద వేస్తున్న అక్రమ కేసులు, నిరంతర దాడులు వీటి గురించి మేము ఇంతకుముందే డిజిపి ఇతర పోలీసు అధికారులకు తెలియచేయడం జరిగిందిన్నారు. గుండాలు దాడులు చేస్తున్నా మా పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ అవుతున్న సమయంలో, ప్రజలకు మరింత ఉపయోగారమైన కార్యక్రమాలు చేయడం, అధికారులను ప్రశ్నించడం, ఇవన్నీ అక్కడ ఉన్న అధికారులకు కంటి తరుపున మారాయన్నారు. అధికారులను కానీ డిపార్ట్‌మెంట్ వారిని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఎలా నైనా పార్టీ కార్యక్రమాలను ఆపాలని కక్షపూరిత ఉద్దేశంతో మా పార్టీ కార్యకర్తల మీద అనేక రకమైన అసత్య, అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందని విమ‌ర్శించారు. కార్యక్రమాలను అడ్డుకునే విధంగా చేయడం కోసం జిల్లా పార్టీ నాయకులు నయీమ్ భాష, రాజేందర్, నాగేందర్ ల‌ను అరెస్ట్ చేశార‌న్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని కార్యక్రమాలని ఆపాలని పోలీసు వారి ముఖ్య ఉద్దేశమ‌న్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు ఉంద‌ని ఆరోపించారు. ఇలాంటి అరెస్టులు అక్రమ కార్యక్రమాలతో ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకోలేరని స్ప‌ష్టం చేశారు.
ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page