రాబరి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : దారి దోపిడి కేసులో నిందుతులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వారి అరెస్టు మీడియా వివరాలను చిక్కడపల్లి సిఐ రాజునాయక్, ముషీరాబాద్ సిఐ రాంబాబు లతో కలిసి చిక్కడపల్లి ఏసిపి రమేష్ వెల్లడించారు. రాంనగర్ మేదర్‌బస్తికి చెందిన కనకుంట్ల మల్లేష్ ( 27 ) వృత్తిరీత్యా పెయింటర్‌గా పని చేస్తుంటాడు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018, 2022లో డబ్బుల కోసం పలు చోరీ కేసుల్లో మల్లేష్ నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. మంగళహాట్‌కు చెందిన మాలోతు నరేష్ అలియాస్ గణేష్ అలియాస్ శివ ( 31 ) వృత్తిరిత్యా పెయింటర్‌గా చేస్తుంటాడు. నరేష్ కూడా 2012 సంవత్సరంలో సనత్‌నగర్ పిఎస్ పరిధిలో ఓ కేసు, చిక్కడపల్లి పిఎస్ పరిధిలో 2017, 2018, 2022 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ నెల 5వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1120 సమీపంలోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి వద్దకు మల్లేష్, నరేష్ ఇద్దరు వచ్చి కత్తిని చూపించి బెదిరించి 3500 రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిక్కడపల్లి పిఎస్ డిఐ శంకర్, క్రైమ్ టీమ్‌తో కలిసి నిందితులను పట్టుకునే యత్నంలో పడ్డారు. ఈ నేపధ్యంలో 10 సిసి కెమెరాలను చూసి నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1120 రూపాయల నగదును, పేపర్ కటింగ్ బ్లేడ్‌ను స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్‌కు తరలించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply