...

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై భార‌త సైనికుల దాడి పై సంబురాలు

 

 

ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై భార‌త సైనికుల దాడి పై సంబురాలు

 

జాతీయ జెండాల‌తో క‌లిసి ర్యాలీని నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

                            జాతీయ జెండాల‌తో క‌లిసి ర్యాలీని నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :    కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైనిక బలగాలు మంగళవారం అర్థరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని 9 ఉగ్రమూకల స్థావరాలపై బాంబుల దాడితో విరుచుకు పడి సుమారు 100 కు పైగా లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేప‌ధ్యంలో ముషీరాబాద్ భార‌త సైనికులకు మ‌ద్ద‌తుగా, వారి దాడుల‌ను స్వాగ‌తిస్తూ బుధ‌వారం సంబురాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాల‌తో ర్యాలీని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై జాతీయ జెండాల‌ను ప‌ట్టుకుని జైహింద్ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే పోయే వారికి స్వీట్లు తినిపించారు. ఈ సంద‌ర్భంగా కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మోందించడంలో భార‌త సైన్యానికి రుణ‌ప‌డి ఉంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు జావీద్ ఖాన్‌, మోయిన్‌, మునావ‌ర్‌చాంద్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, ప‌రుశురామ్ యాద‌వ్, శ్రీశైలం యాద‌వ్‌, క్రాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.