హైదరాబాద్, మే 31, అద్దం న్యూస్ : రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న బిటెక్ నకిలీ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేందర్, శ్రీమాన్, స్టాలిన్ లతో కలిసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అందించే పేరుతో నకిలీ బిటెక్ యూనివర్శీటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఒక సంవత్సరానికి లక్షలు రూపాయలు తీసుకుని తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, ఈ నకిలీ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెక్ట్స్ వేవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ( ఎన్ఐఎటి ), నానక్ రామ్ గూడ లిఫ్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫైనాన్స్ డిస్ట్రిక్ లలో ప్రైవేటు అపార్ట్మెంట్స్ తీసుకుని ఐఐటీలో లేదా ఎన్ఐటిలలో అడ్మిషన్లు రాకపోయిన ఐఐటి లాగ, ఎన్ఐటి స్థాయిలో సిఎస్ఈ ( ఆర్టీఫిషియల్, మెషిన్ లెర్నింగ్ ), సైబర్ సెక్యూరిటి కోర్సుల పేరుతో అడ్మిషన్లు తీసుకుని తరగతులు నడుపుతున్నారన్నారు. యూజిసి, ఎఐసిఈటి అనుమతులు లేకుండా క్యాంపస్ ప్రారంభించి, విద్యార్థులను చేర్పించుకొని భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారన్నారు. ప్రైవేటు డిమ్డ్ యూనివర్శీటీలతో ఎంఓయు ( మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ ) ఉందనే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని… ఇంత జరుగుతున్నా కనీసం ప్రభుత్వం గాని, ఉన్నత విద్యామండలి చైర్మన్ స్పందించడం లేదన్నారు.
కనీసం తల్లిదండ్రులు అవగాహన కోసం నకిలీ యూనివర్శీటీలు పేర్లు ప్రకటించి, చేరొద్దని ప్రకటనలు చేయాలి… కానీ అడ్మిషన్లు పూర్తిగా నింపుతున్న సరే ఉన్నత విద్యామండలి స్పందించడం లేదంటే వారికి ఏమి ముట్టిందో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి నకిలీ యూనివర్శీటీలు వచ్చి వందల కోట్లు కొలగోడుతున్న ఎందుకు ఆయన స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ సీట్లు నింపకముందే బి కేటగిరీ సిట్లను డోనేషన్లు లక్షలాది రూపాయలు తీసుకుని అమ్ముకుంటున్నారని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు. బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని డోనేషన్లు వసూళ్లు చేస్తున్న కళాశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అధిక ఫీజులు తీసుకుంటున్న కళాశాలపై టాస్క్ఫోర్స్ కమిటీ వేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply