Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadనిబంధనలను పాటించని ప్రైవేట్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి...

నిబంధనలను పాటించని ప్రైవేట్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, మే 27, అద్దం న్యూస్ :   హైదరాబాద్ నగరంలో కనీసం నిబంధనలను పాటించకుండా సౌకర్యాలు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్టల్స్ పై నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) హైదరాబాద్ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… ధనార్జనే ధ్యేయంగా కనీసమైన సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకోవడం ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడం కోసం హాస్టల్స్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ హాస్టల్స్ వేల రూపాయల్లో ఫీజులను పెట్టి సరైన భోజన వసతి లేకున్నా, సరైన వెంటిలేషన్ లేకున్నా, ప్రైవేట్ హాస్టల్స్ నడుపుతున్నారన్నారు. ప్రైవేట్ హాస్టల్స్‌లో ఒక్కో రూమ్‌లో ఆరేడు మందిని పెట్టేసి ఒక్కరి నుండి 6000 నుండి 7000 రూపాయలను వసూలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి అధికారులు ఈ ప్రైవేట్ హాస్టల్స్ ల‌పై నిరంతరమైన నిఘాని ఏర్పాటు చేసి తనిఖీలు చేసి నిబంధనలను పాటించని ప్రవేట్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకొనేడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ప్రవేట్ హాస్టల్స్ పై ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు దామెర్ల హష్మీ బాబు, కార్యదర్శి ఎండి.జావేద్. జిల్లా నాయకులు రాజు, దేవేందర్, రవి పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page