మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర
జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యం – అదం సంతోష్ కుమార్
సికింద్రాబాద్, జనవరి 11, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అదం సంతోష్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అలాగే డివిజన్‌లో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అదం సంతోష్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్థానికేతర ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ మహా పాదయాత్రకు మెట్టుగూడ మాజీ కార్పొరేటర్ స్వర్గీయ అడవయ్య రెండో కుమారుడు రాజేందర్ యాదవ్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో బిఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజేందర్ యాదవ్, తండ్రి అడవయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ మెట్టుగూడ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన పాల్గొనడంతో డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ పాదయాత్ర ద్వారా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తన బలాన్ని వేగంగా విస్తరిస్తున్న విషయం స్పష్టంగా కనిపించింది. పక్కా వ్యూహంతో, దృఢ సంకల్పంతో రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గెలుపే లక్ష్యంగా అదం సంతోష్ కుమార్ ముందుకు సాగుతున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిల్పాచారి, రాజేందర్ యాదవ్, బెన్న, శ్రీను రెడ్డి, జయరాజ్, ఎలిజబెత్ రాణి, రవి, మాధవి, దిలీప్, దీపు, ధీర్ సింగ్, పృథ్వీరాజ్, వెంకట్, రఘుపతి, రేఖ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply