Friday, September 18, 2026
HomeAPTirumala: తిరుమల భక్తులకు అలర్ట్..

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  తిరుమల (Tirumala) భక్తులకు అలర్ట్.. డిసెంబర్, జనవరి మాసాలలో తిరుమలలో అనేక పర్వదినాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పర్వదినాల సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు డిసెంబర్ 30 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తు్న్న సంగతి తెలిసిందే. పది రోజుల పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగానూ వీఐపీ దర్శనాలు రద్దు చేశారు.

మరోవైపు తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ 23న తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

వైకుంఠ ఏకాదశి ముందు రోజు అంటే డిసెంబర్ 29వ తేదీ, అలాగే వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30వ తేది), వైకుంఠ ద్వార దర్శనాలు ( డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేది వరకు), రథ సప్తమి ( జనవరి 25) రోజులలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఆయా రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో ఆయా రోజులకు ముందురోజు వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page