జూబ్లీహిల్స్లో ముస్లీంలందరి మద్దతు బిఆర్ఎస్ పార్టీకే
– బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎ.వాహీద్ అలీ
హైదరాబాద్, నవంబర్ 8, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్లో ముస్లీంలందరూ బిఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎ.వాహీద్ అలీ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముస్లీంలందరూ భద్రత కోసం బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి అభ్యర్థి సునితను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మైనారిటీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి అభ్యున్నతి కోసం కృషి చేసింది ఒక్క బిఆర్ఎస్ పార్టే అని అన్నారు. జూబ్లీహిల్స్లో ప్రచారంలో అక్కడి ఓటర్లు బిఆర్ఎస్ ప్రభుత్వమే మేలు అని, బిఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారని వాహీద్ అలీ అన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షాహద్ బాబా, ఎండి.మహబూబ్ ఖాన్, ఫెరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply