హ‌క్కుల కోసం మ‌హిళంద‌రూ ఐక్యంగా ఉండాలి – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్

 హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ :  హ‌క్కుల కోసం మ‌హిళంద‌రూ ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం హైద‌రాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఇందిరా శోభన్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సూర్య శ్రావణి మాశెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిళలు తలచుకుంటే జరగని పని అంటూ ఏదీ లేదన్నారు. మహిళలు సామాజిక స్ఫూర్తితో ముందడుగు వేస్తే యావత్ సమాజం మొత్తం వారి వెంటే ఉంటుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న ఈ సమాజంలో నేటికీ మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టాలంటే నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు. ఐక్యమత్యంగా ఉండి ఆర్థిక రాజకీయ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో దూసుకుపోవాలన్నారు. మహిళలు వంటింటి కుందేలుగా ఉండొద్దని.. పోరాడే సింహాలుగా ఉండాలని అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వీరసేవ లింగాయత్ లింగా బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి, దశాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ కల్లపల్లి రాచప్ప, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి విద్యుల్ లత, కోశాధికారి మార్గపు అశ్విని శంకర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శివ శరణ్, యువజన అధ్యక్షుడు భరత్, భోజన ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రఘు, మీడియా ఇంచార్జ్ మణికుమార్, సలహాదారులు మంజుల, ఉమాదేవి, ఉపాధ్యక్షురాలు సుభాషిని, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తమ ఆటపాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆట‌ల్లో విజేతల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page