అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధుల కేటాయింపు హర్షణీయం
– కాంగ్రెస్ పార్టీ డిసిసి సికింద్రాబాద్ కార్యదర్శి దేవి వర ప్రసాద్
హైదరాబాద్, జూన్ 8, ( అద్దం న్యూస్ ) : డాక్టర్.బిఆర్.అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధుల కేటాయింపు హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ డిసిసి సికింద్రాబాద్ కార్యదర్శి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డు సభ్యుడు గుండెల్లి దేవి వర ప్రసాద్ అన్నారు. హైదరాబాద్ కవాడిగూడలోని ట్యాంక్‌బండ్‌లోని డిబిఆర్ మిల్ పక్కన నూతన అంబేద్కర్ భవనానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 12 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనానికి 108 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. సోమవారం అంబేద్కర్ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సి అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డీసీసీ సెక్రటరీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ బోర్డు మెంబర్ గుండెల్లి దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా గుండెల్లి దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ… అంబేద్కర్ భవన నిర్మాణంతో ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారన్నారు. స్టడీ సర్కిల్ ఆల్, కల్చరల్ యాక్టివిటీస్‌తో పాటు ఎస్సీ విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ భవనం నిర్మాణం చరిత్రకంగా నిలిచిపోతుందని వర ప్రసాద్ అన్నారు.![]()

![]()












Leave a Reply