Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadశ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి...

శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి

– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్



హైదరాబాద్, జులై 15, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌, బ‌స్తీవాసులతో కలిసి ఆర్‌డిఓతో ఆయ‌న‌ కార్యాలయంలో కార్పొరేట‌ర్ పావ‌ని సమీక్షించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీలోని 19 పెద దళిత కుటుంబాల ఇళ్లను గత ఏడాది ప్రభుత్వ అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడంతో ఏడాదిన్నరగా పేదలకు పునరావాసం కల్పించేందుకు ఆలస్యం ఎందుకు జరుగుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి ( ఆర్‌డిఓ ) పి.సాయి రామ్ ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ప్రశ్నించారు. ఇళ్ల కేటాయింపు కోసం కావలసిన వివరాలను, ఎంఆర్ఓ, ఆర్డిఓ, కలెక్టర్ కార్యాలయాలలో అందచేసి కూడా 15 నెలలు కావొస్తుందని, ఈ విషయంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ స‌భ్యుడు కె.లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు బాధితులకు ఇళ్లు మంజూరు చేయాలని సూచించారని కార్పొరేటర్ పావ‌ని వివరించారు. తాము బాధితుల వెంట ఇటీవల కలెక్టర్‌ను కూడా కలిసిన సందర్భంలో త్వరలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పేదల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కార్పొరేటర్ పావ‌ని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆర్‌డిఓ ఇళ్ల మంజూరు పూర్తి అయ్యిందని, త్వరలో కుటుంబాల వారిగా కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ సమీక్షలో బ‌స్తీవాసులు ఎం. బి.కృష్ణ, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page