కృష్ణానగర్ బస్తీలో ఘనంగా అంబేద్కర్ జయంతి
ముషీరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయకోవిదుడు డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమం మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ కృష్ణానగర్ బస్తీలో ఘనంగా జరిగింది. బస్తీ అధ్యక్షుడు వై.శాంతి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బస్తీ ఉపాధ్యక్షుడు, పోచమ్మ టెంపుల్ కమిటీ చైర్మన్ ఈరెలి రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి స్వామిరావు, ప్రజాస్వామ్య పార్టీ అధ్యక్షుడు రాజ్‌కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్తీ అధ్యక్షుడు వై.శాంతికుమార్ అంబేద్కర్ విగ్రహంతో పాటు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.













Leave a Reply