Friday, September 18, 2026
HomeHyderabadతెలంగాణాలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలి – ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...

తెలంగాణాలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలి – ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి

 

తెలంగాణాలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాలి
ఫీజులను పెంచకుండా నిర్ణయం చేయాలి
ఉన్నత విద్యామండలి తనిఖీల రీపోర్టును తక్షణం బహిర్గతం చేయాలి
 – ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి

 

హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ :       తెలంగాణాలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపించాల‌ని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఈ కాలమ్‌లో నిర్వ‌హించిన తనిఖీలలో అనేక లోపాలు బయటపడ్డాయన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపలకులను నియమించకుండా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయటం కోసం సిలికాన్ వేలి ముద్రలను వేస్తూ అక్రమంగా అధ్యాపలకులు ఎక్కువగా ఉన్నారనే పేరుతో ప్రభుత్వాన్ని ఉన్నత విద్యామండలిని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు మోసం చేస్తున్నాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉండగా అందులో కేవలం పదుల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలు మాత్రమే టిఎఎఫ్‌ఆర్‌సి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అధ్యాపకులు సౌకర్యాలు కలిగి ఉన్నాయ‌ని తెలిపారు. మిగతా కాలేజీలలో ఎక్కడ కూడా ఆ రూపంలో అనుమతులు లేవు. రీయింబర్స్‌మెంట్‌ను పొందాలనే దరుద్ధేశంతో విద్యార్థులను చేర్పించుకోవటం కోసం కొత్త కొత్త కోర్సుల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు పెంచుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారు 2 లక్షల 40 వేల నుండి ఒక లక్షా 75 వేల కలేజీల ఫీజులు పెంచాలని ప్రతిపాదనలు తెలంగాణ అడ్మిషన్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ ( టిఎఎఫ్‌ఆర్‌సి )కి ఇచ్చారని… ఇందులో ప్రధానంగా టిఎఎఫ్‌ఆర్‌సి దగ్గర ఈ ఫీజులు నిర్ణయించడం కోసం మేము అధ్యాపకుల మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని, మౌలిక వసతులు కల్పించిడం కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారన్నారు. ఈ పేరుతో అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలిని కూడా తప్పుదోవపట్టించే ప్రయత్నం, వందల కోట్ల అవినీతికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణలో ఈ కాలమ్‌లో ఉన్నత విద్యామండలి నిర్వహించినటువంటి తనిఖీల వివరాలను బహిర్గతం చేయాలని, ఈ రూపంలో ఇంజనీరింగ్‌ కాలేజీలలో ఉన్న లోపాల మీద సిఎం ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష చేసి చర్యలు తీసుకోవాల‌ని, అలాగే ఫీజులు పెంచకుండా తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page