...

ప్రాచీన కళారూపాలను కాపాడుకోవాలి – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ‌

ప్రాచీన కళారూపాలను కాపాడుకోవాలి

– తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ‌

– తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు

తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు

తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు

సిటీ క‌ల్చ‌ర‌ల్ , మే 18, అద్దం న్యూస్ :  ప్రాచీన కళారూపాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అకాడమీ డైరెక్టర్ విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో 172 కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు.

తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నృత్య వేడుకలు

తెలంగాణలోని కాకుండా వివిధ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్య, పౌరాణిక, పేరిణి, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం నాట్య గురువులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి బూర్గుల మధుసూధన్, కూచిపూడి నాట్య గురువులు శ్రీవాణి, డాక్ట‌ర్‌.ఉషా మాధవి చలికొండ , పాలకొల్లు ఆనందమయి, తాళ్లూరి పద్మ స్రవంతి, డాక్ట‌ర్‌.అనూష రఘురామ్, డాక్ట‌ర్‌.గురువేద భార్గవి, డాక్ట‌ర్‌.వీరవల్లి భాను, పిల్లిట్ల రమేష్, రంగస్థల నటి మణిబాల, సంస్థ అధ్యక్షుడు వీక్కీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.