గ‌ద్ద‌ర్ ఫిలీం అవార్డును అడ్డుకుంటాం – తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) హెచ్చ‌రిక‌

హైదరాబాద్, మే 17, అద్దం న్యూస్ :   గ‌ద్ద‌ర్ ఫిలీం అవార్డును తెలంగాణ సినిమాల‌కు ఇవ్వ‌క‌పోతే ఆడ్డుకుంటామ‌ని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. చిక్క‌డ‌ప‌ల్లిలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర గౌర‌వ స‌ల‌హాదారులు తుమ్మ‌ల ప్ర‌ఫూల్ రాంరెడ్డి, రాష్ట్ర క‌న్వీన‌ర్ లారా, కో-క‌న్వీన‌ర్ మోహ‌న్ బైరాగి లు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి 11 ఏండ్లు గ‌డుస్తున్నా మ‌న సినిమా రంగం పై ఆంధ్ర సినిమా పెద్ద‌ల ఆదిప‌త్యం కొన‌సాగుతుంద‌న్నారు. పేరుకే తెలంగాణ ఫిలీం ఛాంబ‌ర్‌గా ఉంద‌ని, ఫిలీం అవార్డులు ఆంధ్ర ఫిలీమ్ ఛాంబ‌ర్ నిర్వ‌హించ‌డం సిగ్గు చేటు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న సినిమాల‌కు థీయేట‌ర్లు దొర‌క‌డంలేద‌ని, థీయేట‌ర్ల మాఫియా న‌డుస్తుంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ సినిమా రంగం ఎదుర్కొంటున్న అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రించాల‌ని, గ‌ద్ద‌ర్ ఫిలీమ్ అవార్డు తెలంగాణ సినిమాల‌కు ఇవ్వ‌క‌పోతే గ‌ద్ద‌ర్ ఫిలీమ్ అవార్డు కార్యక్ర‌మాన్ని అడ్డుకుంటామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిసివి నాయ‌కులు ర‌వి, సాయి కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page