Friday, September 18, 2026
Homeculturalsప్రాచీన కళలను కాపాడుకోవాలి

ప్రాచీన కళలను కాపాడుకోవాలి

సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వసంతోత్సవం పేరిట కూచిపూడి నృత్య ప్రదర్శనలు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సంస్కార భారతి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేవివి శర్మ, సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ కళలు, కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఉగాది పండుగ అందరికీ సుఖశాంతులను కలగజేయాలని ఆకాంక్షించారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు సంగీత, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మశ్రీ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page