అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న
– ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, నవంబర్ 30, అద్దం న్యూస్ : అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మదర్ ల్యాండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ డివిజన్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేయడంవల్ల వారికి ఎంతో చేయూతగా ఉంటుం దన్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఊరటనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పోస్టర్ శ్రీనివాస్, అలీ, బీఆర్ఎస్ మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
![]()

![]()

