Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadసయ్యద్ అన్వర్ ఉల్లా హుస్సేని భక్తియారీ వ‌ర్థంతి సంద‌ర్భంగా అన్న‌దానం

సయ్యద్ అన్వర్ ఉల్లా హుస్సేని భక్తియారీ వ‌ర్థంతి సంద‌ర్భంగా అన్న‌దానం

📰 Generate e-Paper Clip

సయ్యద్ అన్వర్ ఉల్లా హుస్సేని భక్తియారీ వ‌ర్థంతి సంద‌ర్భంగా అన్న‌దానం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 7, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ రేడియంట్ హై స్కూల్ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త స‌య్య‌ద్  న్వ‌రుల్లా హుస్సేని భ‌క్తియారి ప్ర‌థ‌మ వ‌ర్థంతి కార్య‌క్ర‌మం ఆదివారం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు దీన్ ద‌యాల్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ ప‌ఠాన్‌బ‌స్తీలో అన్న‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… స‌య్య‌ద్ అన్వ‌రుల్లా హుస్సేని భ‌క్తియారి గ‌త 60 ఏళ్ల క్రిత‌మే రేడియంట్ హై స్కూల్‌ను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు ఉన్న‌త భ‌విష్య‌త్‌ను అంద‌చేశార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రేడియంట్ హై స్కూల్ క‌ర‌స్పాండెంట్ స‌య్య‌ద్ అహ్మ‌దుల్లా భ‌క్తియారి, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఎండి.జావీద్ ఖాన్‌, మోయిన్‌, స‌ల్మాన్‌, రంగు శ్రీనివాస్‌, బ‌ల్లా ప్ర‌శాంత్‌, చింటు, బాల్‌రాజ్‌గౌడ్, ల‌క్ష్మ‌ణ్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page