Sunday, September 20, 2026
No menu items!
Homecinemaఆలస్యంగా 'అన్నగారు వస్తారు'

ఆలస్యంగా ‘అన్నగారు వస్తారు’

📰 Generate e-Paper Clip

ఆలస్యంగా ‘అన్నగారు వస్తారు’

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యుగానికి ఒక్కడు, ఆవారా, ఖైదీ, ఖాకీ, సర్దార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీ. సత్యం సుందరం మూవీ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వా వాతియార్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటించారు. గత ఏడాది డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ మూవీకి చివరి నిమిషంలో ఫైనాన్స్ కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో వాయిదా పడింది. అయితే జనవరి 9న విడుదల కావాల్సిన విజయ్ జన నాయగన్ వాయిదా పడటం ఈ సినిమాకు కలిసాచ్చింది. సంక్రాంతి రేస్ లో ఖాళీ ఏర్పడటంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ జనవరి 14న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారి కంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో మాత్రమే విడుదల కానుంది. తెలుగు వెర్ష సున్ను కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావా లని నిర్ణయించారు. తెలుగులో ఈ సినిమాను ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vastharu) అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page