Sunday, September 20, 2026
No menu items!
HomeHyderabadమంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం

మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏక‌గ్రీవ చ‌ట్ట‌బ‌ద్ధ‌త కై ఆమోదం పొందిన సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నాయ‌కులు సంబురాలు జ‌రుపుకున్నారు. బుధ‌వారం రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో ఎంఆర్‌పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ చిత్ర ప‌టానికి పాలాభిషేకం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎంఆర్‌పిఎస్ నాయకుడు గండి కృష్ణ మాదిగ, ఎంఎస్‌పి ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ లు మాట్లాడుతూ… ఎంఆర్‌పిఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలు మాదిగ మాదిగ ఉప కులాల వందేళ్ల భవిష్యత్తు కోసం ఉద్యమం జ‌రిగింద‌న్నారు. 2024 ఆగస్టు ఒకటో తేదీన రాష్ట్రాలకే ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కును సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు చిలక ఎల్లయ్య మాదిగ, రాములు మాదిగ, తొట్ల గోపి మాదిగ, నర్సింగరావు మాదిగ, దశరథ్ మాదిగ, శంకర్ మాదిగ, సాయిలు మాదిగ, దేశ్ పాండే, నాగరాజు మాదిగ, ఎంఆర్‌పిఎస్ డివిజన్ ఇంచార్జ్ రోషన్ వినాయక రావు మాదిగ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page