Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadతెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల...

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికం – తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికం
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి

హైదరాబాద్, డిసెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :     తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు అప్ర‌జాస్వామికమ‌ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఎన్ఐఏ సంబంధించిన పోలీసులు ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసుకొని, వారి ఇంటిని సోదా చేసి, అరెస్టు చేయడాన్ని టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ పక్షాన ఖండిస్తున్నట్లుగా ప్రపూల్ రామిరెడ్డి తెలిపారు. ఆదివారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని జేఏసి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌ఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ… గాదె ఇన్నయ్య ఎంతో కాలంగా ప్రజాసేవలో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకుంటూ అనేక మంది అనాధ పిల్లలను చేరదీసి, పెంచి, పెళ్లిళ్లు సైతం చేసిన వ్యక్తి అని, అలాంటిది ఏదో ఒక సందర్భంలో అమిత్ షా ను విమర్శించారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అరెస్టు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా… ప్రశ్నించకుండా ప్రజాభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఎవరు మాట్లాడితే వారిని అర్బన్ నక్సల్స్ పేరుతో అణిచివేయడం, అక్రమ కేసులు పెట్టడం జరుగుతుందని, అది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం అని ధ్వ‌జ‌మెత్తారు. అరెస్టు చేసిన గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టియు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, ఉపాధ్య‌క్షుడు మోహన్ బైరాగి, కళాకారుల వేదిక అధ్యక్షుడు పెద్ద యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page