అంగరంగ వైభవంగా గోల్నకలో ఆషాడ మాస బోనాలు
గోల్నాక, ఆగస్టు 9, ( అద్దం న్యూస్ ) : ఆషాడ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బోనాల పండుగకు విదేశాలలో ఎంతో ఆదరణ ఉందని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక చర్చి లైన్‌లోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బోయ రంగయ్య, ఉపాధ్యక్షుడు గొట్టాల వినోద్ కుమార్ చారి, బ్యాంక్ అధికారి పాక స్వామి, ప్రధాన కార్యదర్శి ముడారి శ్రీనివాస్, పోతరాజు సైదులు, రవీందర్, నాగుచారి, సాయి, చందు, ప్రవీణ్, నవీన్, సత్యప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply