...

తెలంగాణ ఉద్యమానికి జ‌య‌శంక‌ర్ సార్ ఒక దిక్సూచి

తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి జ‌య‌శంక‌ర్ సార్‌
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 6, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ఉద్యమానికి జ‌య‌శంక‌ర్ సార్ ఒక దిక్సూచి, సిద్ధాంతకర్త అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఉద్య‌మ‌కారుడు రేషం మ‌ల్లేష్ ఆధ్వ‌ర్యంలో గురువారం తెలంగాణ జాతిపిత జయశంకర్ జయంతి కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాంన‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపాల్ హాజ‌రై రేషం మ‌ల్లేష్‌తో క‌లిసి జ‌య‌శంక‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను, నీళ్లు, నిధులు, నియామకాల దోపిడీని గణాంకాలతో సహా ప్రజలకు వివరించి, భావజాలాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లిన గొప్ప తత్వవేత్త అని కొనియాడారు. ” అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా ” ( తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్ళారా చూడాలనే కోరికతోనే ఆయన తుదిశ్వాస వరకు పోరాడారన్నారు.

రేషం మ‌ల్లేష్ మాట్లాడుతూ… 1952 నాన్-ముల్కీ ఉద్యమం, 1954 ఫజల్ అలీ కమిషన్ ఎదుట విశాలాంధ్ర ప్రతిపాదనను జ‌య‌శంక‌ర్ సార్ వ్యతిరేకించార‌న్నారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌కు మార్గదర్శిగా ఆయన సేవ‌ల‌ను అందించార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, ఉద్య‌మ‌కారులు సిరిగిరి శ్యామ్‌, అజయ్ ముదిరాజ్, కల్వ గోపి, ముదిగొండ మురళి, జుగేంద‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు జైసింహా, బిక్షపతి, దామోద‌ర్‌, బ‌ల్లిక‌రి ర‌మేష్‌, రాకం సత్యనారాయణ, వెంకటేష్, శ్రీను, రాజు గౌడ్, సాలమ్మ, సబిత, తిరుమల, మేరీ, అనురాధ, రేణుక, నందిని తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.