కోయిల్కార్ రాజేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ
హైదరాబాద్, జనవరి 2, అద్దం న్యూస్ : హైదరాబాద్ గోషామహల్ చందన్ వాడిలో ఆరె కటిక సంఘం ప్రధాన కార్యదర్శి కోయిల్కార్ రాజేష్ ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. స్వామీలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి గీతాలను ఆలపించారు. ఈ పూజలకు ముఖ్యఅతిథిగా ఆరె కటిక అభివృద్ధి సంఘం అధ్యక్షుడు భూంపల్లి గజ్బిన్‌కార్ అశోక్ దాదా, నర్సింగ్ రావు చౌదరి, రాష్ట్ర కోశాధికారి కేడి దినేష్, లక్ష్మణరావు, ఎల్.బలరాం, సరస్వతి బాయ్, జ్ఞానేశ్వరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల గురువు శ్రీ శ్రీ శ్రీ ధర్మవ్యాధుడి ఫోటో జ్ఞాపికను రాజేష్‌కు ఆరెకటిక అభివృద్ధి సంఘం నాయకులు అందచేశారు. ![]()

![]()













Leave a Reply