టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి

 

హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భార‌త దేశ మాజీ ఉప ప్ర‌ధాన మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జ‌యంతి కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా హాజ‌రై బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ చిత్ర ప‌టానికి పూల‌మాలలేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… బాబు జగ్జీవ‌న్‌రామ్‌ భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అట్టడుగు బడుగు బలహీన గిరిజన వర్గాలకు ఎంతో సేవ చేశారన్నారు. తొలిసారిగా ఆయన విశిష్టతను, ప్రాధాన్యతను గుర్తించి స్వర్గీయ నందమూరి తారకం రామారావు గుర్తించి ఎల్బీ స్టేడియం కాలేజీ వద్ద చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసారన్నారు. దళత వర్గాల అభ్యున్నతికి, సంక్షేమం కోసమే కాకుండా యూవత్ భారత జాతికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలందించార‌ని తెలిపారు. దేశ రాజకీయూల్లో అత్యున్నత పదవులు నిర్వహించిన దళిత జన ఆశాజ్యోతి జగ్జీవ‌న్‌రామ్‌ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయ‌కులు రాములు, భవాని శ్రీనివాస్, భాను ప్రకాష్, సత్యనారాయణ. కృష్ణస్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page