గాంధీనగర్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో జరిగింది. ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఆంధ్రా కేఫ్ చౌరస్తా వద్ద జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ యాదవ్, మారిశెట్టి నర్సింగ్‌రావు లు బాబూ జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం సత్యనారాయణ, గుర్రం శంకర్, శంకర్, శ్రీనివాస్, భాస్కర్‌రెడ్డి, కృష్ణయాదవ్, నరేందర్ యాదవ్, అభిషేక్, నవీన్, బాబురావు, రాజేష్, చందు, అప్పు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply